|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 12:23 PM
ఆదిలాబాద్‌లోని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (బోథ్) ను ఎన్సిసి కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్ విపి సింగ్ గురువారం సందర్శించారు. కళాశాల ఎన్సిసి యూనిట్ రికార్డులను పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఐక్యత, క్రమశిక్షణతో సైనిక శిక్షణ పొందాలని, సామాజిక బాధ్యతను పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శివ కృష్ణ, ఎన్సిసి లెఫ్ట్నెంట్ లక్ష్మణ్ పుట్ట పాల్గొన్నారు.