|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 12:34 PM
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల ఇరిగేషన్ ఆఫీస్‌లో అధికారులు మందు పార్టీ పెట్టారు. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా ఇరిగేషన్ ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో పలువురు ఇరిగేషన్ అధికారులకు ఉన్నతాధికారులు నైట్ డ్యూటీ వేశారు. అయితే విధులలో ఉండాల్సిన అధికారులు.. డ్యూటీ వదిలేసి ఆఫీసులో మందు పార్టీ పెట్టారు. పోలీసులను చూడగానే అధికారులు పరారయ్యేందుకు ప్రయత్నించారు.