|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 12:34 PM
భూపాలపల్లిలో ఓటర్ల తొలగింపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని, ఓటర్లను తొలగించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఓటర్ల హక్కులను పరిరక్షించాలని ఈ నిరసన తెలిపారు.