|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 04:10 PM
పోడు భూముల పట్టాల కోసం ఉద్యమిస్తున్న కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దిందా రైతన్నలకు మద్దతుగా నిలిచిన RS ప్రవీణ్ కుమార్ సహా ఇతర నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. 'ఇది రేవంత్ ప్రభుత్వ గుండాగిరికి నిదర్శనం. పోడు రైతులను వేధించడం ఆపి, వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలి. RSPతో సహా పార్టీ నాయకులను తక్షణమే విడుదల చేయాలి. రేవంత్ ప్రభుత్వ పతనం దగ్గర్లోనే ఉంది' అని హెచ్చరించారు.