|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 04:09 PM
రామడుగు మండలం గాయత్రీ పంప్ హౌస్ నుండి రాష్ట్ర ప్రభుత్వం నీటిని విడుదల చేయడంపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి పంపు హౌస్ వద్ద పూజలు చేశారు. తాము ప్రశ్నించిన తర్వాతే ప్రభుత్వం నీటిని విడుదల చేసిందని, రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.