|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 01:51 PM
కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద నీరు వస్తోంది. దీంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ 9 గేట్లను జలమండలి అధికారులు ఎత్తారు.రిజర్వాయర్ 9 గేట్లను నాలుగు ఫీటు మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 20000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా.. 12046 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. మరోవైపు ఉస్మాన్ సాగర్ (గండిపేట్) రిజర్వాయర్ కు 2800 క్యూసెక్కుల వదర నీరు వస్తోంది. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 3.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.911 టీఎంసీలు. పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1782.05 అడుగులు ఉంది.జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినందున ఎండీ అశోక్ రెడ్డి సంబంధిత జలమండలి అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలు, హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులతో సమన్వయంతో వ్యహరించాలని ఆదేశించారు.