|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 12:40 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు గడిచినా, ఎన్నికల వేళ ఇచ్చిన ఆరుగ్యారంటీల హామీలను ఇంకా నెరవేర్చలేదని ఆయన బుధవారం తన ఎక్స్ ఖాతా వేదికగా మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆరు గ్యారంటీలు గుర్తుందా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ తమ హామీలను 100 రోజుల్లోనే నెరవేరుస్తామని చెప్పిందని, కానీ రెండేళ్లు గడిచినా అమలు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు.