|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 12:16 PM
తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారితో MRPS అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు మాజీ ఎంఎల్ఏ శ్రీ జగ్గారెడ్డి గారి నేతృత్వంలో విజయవాడలో సమావేశం కావడం జరిగింది.ఈ సందర్భంగా వికలాంగులు మరియు చేయూత పెన్షన్ దారుల పెన్షన్ల పెంపు మరియు ఇతర డిమాండ్ల పరిష్కారం గురించి మంద కృష్ణ మాదిగ గారు మహేష్ కుమార్ గౌడ్ గారితో చర్చించడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు రూ .ఆరువేల రూపాయలు (6000) పెన్షన్ అలాగే వృద్ధులు , వితంతువులు మరియు ఇతర పెన్షన్ దారులకు పెన్షన్ రూ నాలుగు వేలు (4000) మరియు పూర్తి కండరాల క్షీణత కలిగిన వాళ్లకి రూ 15000 పెన్షన్ ఇస్తున్న విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు మరియు చేత పెన్షన్ దారులకు నేటికీ పెన్షన్ పెంచలేదని విషయాన్ని గుర్తు చేశారు.తక్షణమే తెలంగాణలో వికలాంగులకు రూ 6000 మరియు వృద్ధులతో పాటు ఇతర పెన్షన్ దారులకు రూ 4000 అలాగే పూర్తి కండరాల క్షీణత కలిగిన వారికి రూ 15000 ప్రభుత్వం ఇచ్చేలా చూడాలని కోరారు.
ఈ విషయమై చర్చించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ ఇప్పించాలని వికలాంగులు మరియు చేయూత పెన్షన్ దారులను వెంటబెట్టుకొని వచ్చి కలుస్తామని మంద కృష్ణ మాదిగ గారు తెలిపారు.అలాగే సెప్టెంబర్ 3న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న వికలాంగులు మరియు చేయూత పెన్షన్ దారుల మహా గర్జనకు రావాలని మహేష్ కుమార్ గౌడ్ గారిని మందకృష్ణ మాదిగ గారు ఆహ్వానించారు.