|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 12:05 PM
ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కొమరంభీం ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టులోని మూడు గేట్లను 0.5 మీటర్ల మేర ఎత్తి 4,194 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శనివారం ఉదయం నాటికి ప్రాజెక్టు నీటిమట్టం 237.10 మీటర్లకు చేరుకోవడంతో, మూడు గేట్లను ఎత్తి 3,029 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు మొత్తం నిల్వ సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.461 టీఎంసీల నీరు నిల్వ ఉంది.