|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 08:16 PM
మరో 3 దేశాలకు తెలంగాణ జాగృతి కార్యవర్గాలను నియమిస్తూ జాగృతి అధ్యక్షురాలు కవిత నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం అమెరికా పర్యటనకు వెళ్లేముందు వీరి నియామకాలను ఖరారు చేశారు. పలు దేశాలలోని ప్రవాస తెలంగాణ బిడ్దల సంక్షేమానికి, సాంస్కృతిక వికాసానికి జాగృతి కృషి చేస్తోందని తెలిపారు. ఇప్పటికే 14 దేశాలలో జాగృతి శాఖలకు నూతన భాద్యులను నియమించామని వివరించారు. నూతన కార్యవర్గ భాద్యులు ఆయా దేశాలలో ఉన్న తెలంగాణవాసుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు.