|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 08:14 PM
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శనివారం దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంటలో పర్యటించిన ఆమె, రూ. 18 లక్షల ఎంపీ నిధులతో రెండు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. వాల్మీకి, మాతా గంగా భవాని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ, ప్రతి నియోజకవర్గానికి రూ. 65 లక్షల చొప్పున నిధులు అందిస్తున్నట్లు తెలిపారు.