|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 08:18 PM
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలేకల్ గ్రామ యువకులు, అలంపూర్ శాసనసభ్యులు విజయుడు సార్ ను కలిసి మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యను విన్నవించారు. రేవులపల్లి నుండి 10 గ్రామాలకు నీరు సరఫరా అయిన తర్వాత తమ గ్రామానికి వస్తుండటంతో, చివరి గ్రామమైన జూలేకల్ కు వారానికి ఒకరోజు మాత్రమే నీరు అందుతోందని తెలిపారు. జూలేకల్ స్టేజి నుండి కిలోమీటర్ మేర పైప్ లైన్ ను తమ గ్రామానికి తీసుకువస్తే సమస్య పరిష్కారమవుతుందని కోరగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.