|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 03:06 PM
TG: భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేస్తామని చెప్పారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు గాను ఉమ్మడి 10 జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామని వివరించారు. రాబోయే 24 గంటల్లో రెడ్ అలర్ట్‌గా ఉన్నమెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో తీసుకోవలసిన చర్యలపై కలెక్టర్లను అప్రమత్తం చేశారు.