|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 12:26 PM
తెలంగాణలో శనివారం భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ క్రమంలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవనున్నట్లు అంచనా వేసింది. దీంతో పాటు మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.