|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 03:49 PM
ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు కామర్స్ డిగ్రీ కళాశాల ఎన్సీసీ కేడెట్లు, 32 తెలంగాణ బెటాలియన్ ఆదేశాల మేరకు, ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం జెండా ఊపి హర్ ఘర్ తిరంగా ర్యాలీని గురువారం ప్రారంభించారు. ఈ ర్యాలీ కళాశాల నుండి వినాయకచౌక్, నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్ మీదుగా దేశభక్తి నినాదాలతో కొనసాగింది. కార్యక్రమంలో ఎన్సీసీ కేర్ టేకర్ అధికారులు చంద్రకాంత్, శ్రీనివాస్, నరేష్, క్యాడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు.