|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 03:33 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129వ డివిజన్ విశ్వకర్మ కాలనీలో సీసీ రోడ్లకు సుమారు 49, 50, 000 రూపాయల నిధులు మంజూరు అయ్యాయి. సీసీ రోడ్ పనులను డివిజన్ కార్పొరేటర్ సత్యనారాయణ మరియు విశ్వకర్మ కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ అభివృద్ధికి ఎప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సదానంద మరియు కాలనీ మహిళా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.