|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 11:13 AM
TG: నూడుల్స్‌లో నూనె తక్కువగా వేశారంటూ హోటల్ నిర్వాహకులపై దాడికి పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లా దారుడు మండల పరిధిలోని నాగారం గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం మద్యం మత్తులో ఉన్న 10 మంది యువకులు హోటల్ యజమానులైన భార్యాభర్తలపై మారణాయుధాలతో దాడి చేశారు. అడ్డుకున్న ముగ్గురినీ గాయపరిచారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు చేరుకుని ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పారిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.