|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 08:13 PM
BRS చీఫ్ కేసీఆర్‌ను గద్దెదింపడం కోసం కాంగ్రెస్, బీజేపీ కుట్ర పన్నాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ అన్నారు. 'కేసీఆర్ హయాంలో రూ. 3 లక్షల 50వేల కోట్లు అప్పు మాత్రమే తీసుకున్నారని పార్లమెంట్‌లో చెప్పారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రగతి భవన్‌లో బంగారు టాయిలెట్లు ఉన్నాయని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు అందులో బంగారు టాయిలెట్లు ఉన్నాయా అని అడిగితే డిప్యూటీ సీఎం భట్టి నవ్వుతున్నారు' అని విమర్శించారు.