|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 05:42 PM
TG: గొర్రెలకు ఆహారం కోసం ఆకులు తెంపడానికి వెళ్లి ఓ వ్యక్తి నాలాలో పడిన ఘటన హైదరాబాద్‌లోని పాతబస్తీలో బుధవారం చోటుచేసుకుంది. గౌస్ అనే వ్యక్తి ఆకులు తెంపుతుండగా పట్టు తప్పి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నాలాలో పడిపోయాడు. దీంతో అక్కడి ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ వాసే స్థానికులతో కలిసి.. నిచ్చెన, తాడు సహాయంతో అతడిని కాపాడారు. గౌసే క్షేమంగా బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.