|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 05:53 PM
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, బీజేపీ రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు రంగారెడ్డి (అర్బన్) జిల్లా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం భారీ తిరంగ బైక్ ర్యాలీ జరిగింది. నాగోల్ – భారత్ పెట్రోల్ బంక్ నుండి వనస్థలిపురం కాంప్లెక్స్ వరకు జరిగిన ఈ ర్యాలీలో గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొని, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్ఫూర్తినిచ్చారు.