|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 05:52 PM
TG: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో విమానాల ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పలు విమానాలను దారి మళ్లిస్తున్నారు. మొత్తం 9 విమానాలను విజయవాడ, తిరుపతి, బెంగళూరు ఎయిర్‌పోర్టులకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. నగరంలో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.