|
|
by Suryaa Desk | Fri, Aug 15, 2025, 10:52 AM
జలమండలిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ వేడుకలకు ఎండీ అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. జలమండలి వినియోగదారులు, ఉద్యోగులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకల్లో ఈడీ మయాంక్ మిట్టల్, టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, పర్సనల్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, సీవీవో గ్యానేందర్ రెడ్డి, సీజీఎంలు, యునియన్ నాయకులు, ప్రతినిధులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.