|
|
by Suryaa Desk | Fri, Aug 15, 2025, 11:55 AM
కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాను సాధించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఒత్తిళ్లకు లొంగేది లేదని, తమ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో నిర్మించిన ప్రాజెక్టులు ఆదర్శంగా నిలిచాయని, గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు విఫలమయ్యాయని విమర్శించారు. సెంటిమెంట్ల పేరుతో జరుగుతున్న కుట్రలను రైతులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.