|
|
by Suryaa Desk | Sun, Aug 17, 2025, 06:01 PM
రాష్ట్రంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి బిల్లులు చెల్లించకుండా రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 26 వేల మంది పేద పిల్లల భవిష్యత్తును రేవంత్ సర్కార్ ప్రశ్నార్థకం చేసిందని BRS నేత కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పాఠశాలల్లో చదువుతున్న పిల్లల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కొందరు విద్యార్థులను పాఠశాలల నుంచి స్కూల్ యాజమాన్యం బయటకి పంపించిందని చెప్పారు. ఇప్పటికైనా బిల్లులు చెల్లించి వారి భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు.