|
|
by Suryaa Desk | Fri, Aug 15, 2025, 09:59 AM
హైదరాబాద్‌లో డ్రైవర్ అవసరం లేకుండా నడిచే మినీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన అటానమస్ నావిగేషన్ డేటా అక్విజిషన్ సిస్టం టెక్నాలజీతో ఈ బస్సులను తయారు చేశారు. ప్రస్తుతం ఐఐటీ క్యాంపస్‌లో మూడు రోజులుగా ఈ బస్సులు రోజువారీ సేవలు అందిస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఐఐటీ హైదరాబాద్ డ్రైవర్ రహిత బస్సులను అందుబాటులోకి తెచ్చిందని సిబ్బంది తెలిపారు.