|
|
by Suryaa Desk | Sun, Aug 17, 2025, 04:57 PM
పటాన్ చెరు పట్టణంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో జన్మాష్టమి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, చక్రస్నానం, పూర్ణాహుతి వంటి ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.