|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 07:59 PM
బాలయ్య బాబు – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అఖండ 2 – తాండవం’ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదలకు ముందు రోజైన డిసెంబర్ 4న ప్రీమియర్ షోలను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు నో ఒబ్జెక్షన్ తెలిపింది. తాజాగా, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సినిమా కోసం టికెట్ రేట్ల పెంపు మరియు స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చింది.తెలంగాణలో నేడు (డిసెంబర్ 4) రాత్రి 8 గంటలకు జరిగే ప్రీమియర్ షోకు ₹600 టికెట్ రేటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదనంగా, సింగిల్ స్క్రీన్లలో ₹50, మల్టీప్లెక్సుల్లో ₹100 వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా అనుమతి లభించింది. ఈ ప్రత్యేక రేట్లు కేవలం డిసెంబర్ 5 నుంచి 7 వరకు మూడు రోజులు మాత్రమే వర్తిస్తాయి. ఏపీలో 10 రోజుల పాటు హైక్ అనుమతించినప్పటికీ, తెలంగాణలో మాత్రం మూడు రోజులకు మాత్రమే పరిమితం చేయడం ప్రత్యేకం.అలాగే, ఈ ప్రత్యేక ప్రీమియర్ షోలు మరియు పెరిగిన టికెట్ ధరల ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ (MAWA) కు తప్పనిసరిగా ఇవ్వాలంటూ ప్రభుత్వం షరతు పెట్టింది.జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి—టికెట్ హైక్స్ లేదా ప్రీమియర్ షోల ద్వారా వచ్చే లాభాలలో కొంత భాగం సినీ కార్మికులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ హామీ ప్రకారం ఈ నిర్ణయాలు అమల్లోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది.
Latest News