|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 03:19 PM
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2: తాండవం' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో కలెక్షన్లు, ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి జరుగుతున్న ప్రచారంపై నిర్మాత రామ్ ఆచంట తీవ్రంగా స్పందించారు. బయట వినిపిస్తున్న లెక్కలన్నీ అవాస్తవమని, సోషల్ మీడియాలో సినిమా బిజినెస్ గురించి అవగాహన లేనివారు తప్పుడు లెక్కలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. నచ్చిన నంబర్లు వేస్తున్నారని, అసలు బిజినెస్ ఎలా జరుగుతుందో వారికి తెలియదన్నారు.
Latest News