|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 03:43 PM
సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్రప్రసాద్ మరోసారి తన మాటలతో వివాదంలో చిక్కుకున్నారు. ఓ సినిమా వేడుకలో ఆయన తోటి సీనియర్ నటుడు బ్రహ్మానందంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వేదికపై సరదాగా మొదలైన సంభాషణ కాస్తా హద్దులు దాటిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటం సబబు కాదు" అన్నారు. దీనికి బ్రహ్మానందం సరదాగా స్పందిస్తూ "మేము కూడా మీ శిష్యులమే కదా" అని అన్నారు. వెంటనే రాజేంద్రప్రసాద్ "ముసలి ముండా కొడుకుని కదా నువ్వు" అనడంతో బ్రహ్మానందం ఆశ్చర్యంగా "ఎవరూ అని ప్రశ్నించారు. దీంతో తేరుకున్న రాజేంద్రప్రసాద్నే నుఅంటూ మాటను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.అయితే రాజేంద్రప్రసాద్ ఇలా నోరు జారడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నితిన్ హీరోగా నటించిన 'రాబిన్ హుడ్' సినిమా ఈవెంట్‌లో క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కమెడియన్ అలీపై కూడా అసభ్య పదజాలం ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలో, కొన్నాళ్లుగా రాజేంద్రప్రసాద్ మాటతీరుపై సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో విమర్శలు వస్తున్నాయి. సీనియర్ నటుడిగా ఉండి ఇలా బహిరంగ వేదికలపై సంయమనం కోల్పోవడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు
Latest News