|
|
by Suryaa Desk | Thu, Nov 27, 2025, 08:13 AM
టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన నటి రేణు దేశాయ్ తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. 'పదహారు రోజుల పండుగ' అనే చిత్రంలో నటిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నటి అనసూయతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. 'ఫన్ బిగిన్స్' అంటూ క్యాప్షన్ జోడించారు. ఇటీవల ఆధ్యాత్మిక యాత్రలతో వార్తల్లో నిలిచిన ఆమె, ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.ఈ చిత్రంతో ప్రముఖ నిర్మాత డీఎస్ రావు తనయుడు సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్నారు. 2008లో నితిన్ నటించిన 'ద్రోణ' సినిమాలో ఉత్తమ బాల నటుడిగా సాయి కృష్ణ నంది అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో గోపికా ఉద్యన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 'కేరింత', 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' వంటి చిత్రాలను తెరకెక్కించిన సాయి కిరణ్ అడవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా సురేశ్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రేణు దేశాయ్, అనసూయతో పాటు కృష్ణుడు, వెన్నెల కిషోర్, విష్ణు వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Latest News