|
|
by Suryaa Desk | Sat, Nov 22, 2025, 02:46 PM
టాలీవుడ్ నటి రాశీ ఖన్నా చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సినిమా ఇండస్ట్రీలో హీరోలకు, హీరోయిన్లకు మధ్య ఉన్న ప్రాధాన్యత, గౌరవం విషయంలో నెలకొన్న అసమానతపై ఆమె స్పందించారు. నటీనటుల మార్కెట్ విలువ ఎలా ఉన్నా, సినిమా సెట్స్‌లో మాత్రం అందరికీ సమాన గౌరవం దక్కాలని ఆమె అభిప్రాయపడ్డారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాశీ ఖన్నా, మన దేశంలో చాలా కాలంగా హీరో వర్షిప్ కల్చర్ ఉంది. హీరోలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తారని అందరూ నమ్ముతారు. అది నిజమే కావచ్చు, కానీ మార్కెట్ అనేది జెండర్‌పై కాదు, టాలెంట్‌పై ఆధారపడి ఉంటుంది" అని స్పష్టం చేశారు. తెరపై ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది వారి మార్కెట్ నిర్ణయిస్తుందని, కానీ సెట్స్‌లో మాత్రం ఆ తేడా చూపించకూడదని అన్నారు. మహిళా నటీమణుల పట్ల ప్రవర్తన, వారికి కల్పించే సదుపాయాలు, ఇచ్చే గౌరవంలో ఎలాంటి వ్యత్యాసం ఉండకూడదని ఆమె పేర్కొన్నారు.'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రాశీ ఖన్నా, ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. మధ్యలో కొంత గ్యాప్ తీసుకుని, బాలీవుడ్‌లో కూడా తనను తాను నిరూపించుకున్నారు. ఇటీవల 'తెలుసు కదా' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆమె, ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.ప్రస్తుతం రాశీ ఖన్నా చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి విస్తృత మద్దతు లభిస్తోంది. ఇండస్ట్రీలో మహిళా నటీనటులకు కూడా సమాన గౌరవం ఇవ్వాలంటూ చాలా మంది ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు
Latest News