|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 11:01 AM
ఈ ఏడాది విశ్వ సుందరి కిరీటం మెక్సికో భామను వరించింది. థాయ్‌లాండ్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో మిస్ మెక్సికో ఫాతిమా బాష్ కిరీటం దక్కించుకుంది. మరోవైపు భారత్ తరఫున రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ పాల్గొన్నారు. టాప్ 30 వరకూ రాగలిగిన మణిక.. టాప్ 12లో వెనుదిరిగారు.
ఫాతిమా ఎవరంటే..?
ఫాతిమా బాష్.. మెక్సికో లోని తబాస్కో రాష్ట్రానికి చెందిన యువతి. దేశ చరిత్రలో ఇదే నాలుగో మిస్ యూనివర్స్ కిరీటం కాగా.. తబాస్కోనుంచి టైటిల్‌ను గెలుచుకున్న మొదటి వ్యక్తిగా ఫాతిమా నిలిచింది. ఫైనల్ రౌండ్స్‌లో డెన్మార్క్, నైజీరియా, థాయ్‌లాండ్, వెనిజులా అందగత్తెలతో కలిసి టాప్-5లో నిలిచిన ఫాతిమా కిరీటాన్ని దక్కించుకుంది. ఫాతిమా ఈ టైటిల్‌ను గెలవడంతో మెక్సికో మొత్తం ఉత్సాహంలో మునిగిపోయింది.టాప్-5లో నిలిచిన ఫాతిమా ఈవెనింగ్ గౌన్, కశ్చన్ అండ్ ఆనర్స్ విభాగాల్లో అదరగొట్టింది. జడ్జీలు అడిగిన చివరి ప్రశ్నకు.. నమ్మకం, ధైర్యం, ప్రేమ ఇవే నా జీవిత స్తంభాలు అని చెప్పడంతో ఆమెకు విశ్వసుందరీ కిరీటం దక్కింది. ఈవెంట్లో గత సంవత్సరం మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న డెన్మార్క్ భామ విక్టోరియా హెల్విగ్, స్టేజ్‌పై ఫాతిమా బాష్‌కు కొత్త కిరీటాన్ని ధరింపజేశారు.
Latest News