|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 04:50 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన జపాన్ అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. తన సినిమాలకు జపాన్‌లో లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో, అక్కడి అభిమానులను స్వయంగా కలిసేందుకు ఆయన వచ్చే నెలలో జపాన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన కోసం ప్రస్తుతం నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా చిత్రీకరణ నుంచి ఆయన స్వల్ప విరామం తీసుకోనున్నారు.‘బాహుబలి’ నుంచి ఇటీవల విడుదలైన ‘కల్కి 2898 ఎ.డి’ వరకు ప్రభాస్ చిత్రాలు జపాన్‌లో భారీ విజయాన్ని సాధించాయి. దీంతో అక్కడ ఆయనకు బలమైన అభిమానగణం ఏర్పడింది. నిజానికి ‘కల్కి’ విడుదల సమయంలోనే జపాన్ వెళ్లాలని ప్రభాస్ భావించారు. అయితే, అప్పుడు కాలి గాయంతో బాధపడుతుండటంతో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. త్వరలోనే తప్పకుండా వస్తానని ఓ వీడియో సందేశం ద్వారా అభిమానులకు హామీ ఇచ్చారు.
Latest News