|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 08:23 AM
ప్రేమకథలంటే తనకు ఎంతో ఇష్టమని, ఇటువంటి చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎల్లప్పుడూ ఉంటుందని యువ హీరో నాగచైతన్య అన్నారు. కొవిడ్ సమయంలో యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న చిత్రాలకే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, ప్రేమకథలను చూడరని కొందరు భయపెట్టారని, కానీ అది నిజం కాదని నిరూపితమైందని ఆయన స్పష్టం చేశారు.ప్రియదర్శి, ఆనంది జంటగా నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమంటే’. ఈ చిత్రం నవంబర్ 21న విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగచైతన్య మాట్లాడుతూ నటుడిగా, ప్రేక్షకుడిగా లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఈ జానర్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైందని అన్నారు.నటుడు ప్రియదర్శిపై చైతన్య ప్రశంసలు కురిపించారు. ప్రియదర్శికి చిన్న సినిమా, పెద్ద సినిమా, కామెడీ, యాక్షన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వంటి తేడాలేవీ తెలియవని, ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే విలక్షణ నటుడు అని కొనియాడారు. ‘కస్టడీ’ చిత్రంలో ఆనందితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు
Latest News