|
|
by Suryaa Desk | Mon, Nov 17, 2025, 07:46 PM
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'వారణాసి' సినిమాపై ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టర్‌ను షేర్ చేస్తూ, 'ఈ చిత్రంలో పాల్గొన్న మొత్తం బృందానికి అభినందనలు.. ఈ చిత్రం నిజంగా అద్భుతంగా ఉంటుంది' అని పేర్కొన్నారు. నవంబర్ 12న ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను 2027లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Latest News