|
|
by Suryaa Desk | Mon, Nov 17, 2025, 04:04 PM
చలన చిత్ర రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజనీకాంత్, బాలకృష్ణలకు ఈ ఏడాది 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి–2025)లో ప్రత్యేక సత్కారం అందనుంది. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరిగే వేడుకల్లో ఇద్దరినీ గౌరవించాలని కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ తెలిపారు. వారి నటన, ప్రజాదరణ భారత సినీ పరిశ్రమకు గొప్ప మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. రజనీకాంత్ 1975లో ‘అపూర్వ రాగంగళ్’తో, బాలకృష్ణ బాల నటుడిగా సినీ ప్రయాణం ప్రారంభించారు.
Latest News