![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 04:25 PM
హైదరాబాద్‌కి మరో గౌరవం దక్కింది. టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన లిస్ట్‌లో ప్రపంచంలో టాప్ 100 టేస్టీ నగరాల జాబితాలో భాగ్యనగరం 50వ స్థానాన్ని సంపాదించింది. ఇరానీ చాయ్, బిర్యానీ, హలీమ్, ఉస్మానియా బిస్కెట్ వంటి ప్రత్యేక వంటకాలతో ఈ నగరం దేశ విదేశాల ఆహార ప్రియులకు స్వర్గధామంగా మారింది. అన్ని రుచులు అందుబాటులో ఉండడం, తక్కువ ధరలు, వైవిధ్యభరిత ఆహారం ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి.