|
|
by Suryaa Desk | Sun, Nov 16, 2025, 06:26 PM
దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ విడుదల వేడుక రామోజీ ఫిల్మ్ సిటీలో శనివారం రాత్రి జరిగింది. ఈ ఈవెంట్‌కు సంబంధించి హీరో మహేశ్‌బాబు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'చాలా దూరం నుంచి వచ్చి, మా టీమ్‌పై ప్రేమ కురిపించిన నా అభిమానులు, మీడియా, ప్రతి ఒక్కరికీ థాంక్స్. అతి త్వరలోనే మరోసారి కలుద్దాం' అని అభిమానులకు తెలిపారు. ఆయన 'వారణాసి' వీడియోను షేర్ చేశారు. వేడుక ముందు రోజు కూడా మహేశ్‌బాబు 'ముందు ఇంకా చాలా ఈవెంట్‌లు ఉంటాయి' అని చెప్పినట్లు తెలిసింది.
Latest News