|
|
by Suryaa Desk | Sun, Nov 16, 2025, 04:12 PM
సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తనదైన శైలిలో మహేష్ బాబు సినిమా విడుదలపై హింట్ ఇచ్చారు. ‘‘ఇటీవల మహేశ్ బాబు అభిమానుల గుండెల్లో ఓ కొత్త ఫ్లాట్ కొన్నాను. 2027లో గృహ ప్రవేశం’’ అంటూ సినిమా విడుదల తేదీని పరోక్షంగా వెల్లడించారు. కథానాయిక ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. ‘‘రాజమౌళి గారు ఒక విజనరీ డైరెక్టర్. భారతీయ సినిమాను ఆయన ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారు. ఇలాంటి గొప్ప కళాకారులతో పనిచేసే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మహేశ్ బాబు డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు.
Latest News