![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 02:50 PM
TG: జూరాల ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. 'సీఎంకు ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం వల్లే జూరాల డేంజర్‌లో పడింది. ప్రతి ఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్‌వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించడంలో సర్కార్ నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోంది. జూరాలకు వరద పెరుగుతున్నందున CM, మంత్రులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలి' అని ట్వీట్ చేశారు.