![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 01:05 PM
తెలంగాణ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షురాలు వెన్నెల కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు 150 మంది మహిళా కళాకారులచే మెట్లబావి వద్ద నుండి బోనాలతో బయలుదేరి అమ్మవారికి బోనాలు సమర్పించనున్నట్లు ఆమె వివరించారు.