![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 07:52 PM
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం సుమారు 3 గంటల పాటు కొనసాగింది. రిజర్వేషన్లపై బిల్లులో సవరణలు చేయాలని, అందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం బీసీ వర్గాల్లో హర్షాతిరేకాలను కలిగించింది.