|
|
by Suryaa Desk | Fri, Aug 08, 2025, 03:38 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు ముంచెత్తనున్నాయి. దక్షిణ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం, శనివారం రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ పరిస్థితుల ప్రకారం, భారీ మేఘాలు ఏర్పడుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం మరియు రాత్రి సమయంలో వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా రాత్రి వేళలు అత్యంత జాగ్రత్త అవసరమని, ప్రజలు అగాహంగా ఉండాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్ నగరానికి రానున్న రెండు గంటల్లో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంలో భారీ వర్షాల ప్రభావంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశముండడంతో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
సాయంత్రం 4 గంటల వరకు సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రాంతాల్లో వరద పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలిచ్చారు.