|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 11:33 AM
శ్రావణమాస మూడవ సోమవారం సందర్భంగా రాజన్న గుడిలో శ్రీరాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజలు అర్చక స్వాములు, వేద పండితులు వేదోక్తంగా నిర్వహించారు. సాయంత్రం భీమేశ్వర ఆలయంలో మహాలింగార్చన పూజ కార్యక్రమాలు ఉంటాయని అర్చక స్వాములు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.