|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 02:46 PM
విజయ డెయిరీ డిప్యూటీ డైరక్టర్ మోహన్ మురళి, తెలంగాణ ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వినియోగదారులకు స్వచ్ఛమైన పాలు అందించడమే లక్ష్యంగా విజయ డెయిరీ పనిచేస్తుందని చెప్పారు. గురువారం ఆయన రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్, మక్తమాధారం, చల్లంపల్లి, అమనగల్ గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలను పరిశీలించారు. స్వచ్ఛమైన పాల సేకరణ, నాణ్యతా ప్రమాణాలపై దృష్టి సారించాలని సూచించారు.