|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 02:39 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ నుండి చింతల్ వైపు వెళ్ళే రహదారిపై బుధవారం భారీ ట్రాఫిక్ జామ్ అయింది. గంట నుండి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ లో అంబులెన్స్ చిక్కుకుంది. ఇంతగా ట్రాఫిక్ జామ్ అవ్వడానికి ప్రధాన కారణం వివిధ కంపెనీలకు సంబంధించిన బస్సులు ఇదే సమయంలో వెళ్లడమే.. ఎక్కడపడితే అక్కడ రోడ్లపైన ఆపడం ప్రధాన సమస్యగా ఏర్పడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.