|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 02:09 PM
తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్ పాల్గొన్నారు.