|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 01:55 PM
విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం పెరగాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను, చీర్లవంచ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని తరగతి గదులు, స్టాఫ్ రూమ్, కెమిస్ట్రీ, జువాలజీ, మైక్రోబాయాలజీ ల్యాబ్ లను ఫ్యాషన్ డిజైనింగ్ ఫోటోగ్రఫీ స్టూడియోలను పరిశీలించారు.