|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 01:50 PM
TG: రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తోన్న విషయం తెలిసిందే. కార్డులు పొందిన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల వైపు చూస్తున్నారు. దీంతో వీరికి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు తాజాగా అవకాశం కల్పించింది. కొత్త రేషన్‌కార్డులు పొందిన వారికి ఉచిత విద్యుత్, రాయితీపై గ్యాస్ సిలిండర్ పథకాలు వర్తించనున్నాయి. వీరితోపాటు గతంలో రేషన్ కార్డు కలిగి ఉండి పథకాలు పొందనివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు