|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 12:38 PM
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిడుగురాళ్లకు చెందిన బ్రహ్మారెడ్డి(27) కేపీహెచ్ బీ కాలనీలోని పీజీ హాస్టల్ లో ఉంటున్నాడు.గత కొంతకాలంగా ఉద్యోగ వేటలో ఉన్నాడు. రోజులు గడుస్తున్నా ఉద్యోగం రావట్లేదని గత కొంతకాలంగా మనస్థాపానికి గురవుతున్న బ్రహ్మారెడ్డి.. కుటుంబ సభ్యులకు తాను చనిపోతున్నానని సమాచారమిచ్చి బుధవారం ఉదయం లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు జేమ్స్ హాస్పిటల్ కు తరలించారు.